స్టాక్ మార్కెట్ ప్రారంభ ట్రేడ్‌లో బలహీనపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్లు కోల్పోయి 16,238 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 4,815 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.70 శాతం, నిఫ్టీ 0.66 శాతం మేరకు క్షీణించాయి.
నిన్న 387 పాయింట్లు భారీగా క్షీణించిన అనంతరం ఆ నష్టాలను కొనసాగిస్తూ.. ఈ రోజు ఉదయం బలహీన ట్రెండ్‌తో 16,699 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అంతర్జాతీయ ప్రతికూలతలు ఇందుకు కారణం. అలాగే ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానం సమీక్ష.. స్టాక్ మార్కెట్ పుంజుకునేందుకు ఏ మాత్రం దోహదపడలేదు.
కాగా, ప్రస్తుతం బీఎస్ఈ- 30 స్టాకుల ట్రేడింగ్‌లు ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, స్టెరిలైట్, ఎస్‌బీఐ, డీఎల్ఎఫ్, హీరో హోండా, ఆర్‌కామ్, మారుతీ, సన్ ఫార్మాష్యూటికల్స్ తదితర సంస్థల వాటాలు నష్టపోయాయి. అలాగే ఎంఅండ్ఎం, ఏసీసీ, టాటా మోటార్స్, భారతీ తదితర సంస్థల వాటాలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.