సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » రికవరీ దిశగా పయనిస్తున్న స్టాక్ మార్కెట్లు (Stock Market | recovery | Sensex | BSE | NSE | trade | shares)
Feedback Print Bookmark and Share
 
స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రికవరీ దిశగా పయనిస్తున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోయి 16,301 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 4,823 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.32 శాతం, నిఫ్టీ 0.49 శాతం మేరకు క్షీణించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, మెటల్ స్టాకులు.. స్టెరిలైట్, టాటా స్టీల్, హిండాల్కోలు.. ఆర్‌కామ్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, భెల్, హీరో హోండా, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉండగా.. రిలయన్స్, విప్రో, ఎల్అండ్‌టీ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి.

ఇప్పటి వరకు మొత్తం 2,192 షేర్లు ట్రేడ్ అవగా, 1,692 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అలాగే 456 షేర్లు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.