స్టాక్ మార్కెట్ నష్టాల్లో మరింతగా కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 182 పాయింట్లు కోల్పోయి 16,101 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 4,774 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.12 శాతం, నిఫ్టీ 1.08 శాతం మేరకు క్షీణించాయి.
ఇప్పటి వరకు మొత్తం 2,218 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,633 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 527 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, జేపీ అసోసియేట్స్, టాటా స్టీల్, ఆర్‌కామ్, డీఎల్ఎఫ్, స్టెరిలైట్, హిండాల్కో, హీరో హోండా, భారతీ, భెల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.
హిందుస్థాన్ యునిలీవర్, సన్ ఫార్మా తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ రియాల్టీ, మెటల్ ఇండెక్స్‌లు 3 శాతం బలపహీనపడ్డాయి.