సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనం (Stock Market | Afternoon trade | Sensex | BSE | NSE | shares)
Feedback Print Bookmark and Share
 
స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం పతనం కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 183 పాయింట్లు కోల్పోయి 16,101 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 4,784 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.12 శాతం, నిఫ్టీ 0.88 శాతం మేరకు క్షీణించాయి.

డీఎల్ఎఫ్, ఆర్‌కామ్, భెల్, జేపీ అసోసియేట్స్, టాటా మోటార్స్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉండగా.. సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, హిందుస్థాన్ యునిలివర్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా పవర్, ఐటీసీ, గ్రాసిం తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2,643 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,803 కంపెనీల వాటాలు నష్టాల చవిచూడగా.. 770 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.