సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » అంతర్జాతీయ అనుకూలతలు: లాభాలతో సెన్సెక్స్ ప్రారంభం (Stock Market | profits | Sensex | BSE | NSE | trade | shares)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వారాంతంలో స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దీందో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 16,288 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 88 పాయింట్లు పుంజుకుని 4,838 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.46 శాతం, నిఫ్టీ 1.85 శాతం మేరకు వృద్ధి చెందాయి.

ఆర్థిక సంక్షోభం నుంచి ఈ ఏడాదిలో తొలిసారిగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని.. అంచనాలు వెలువడటంతో... అమెరికా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో అమెరికా స్టాకులు సానుకూల సంకేతాలు ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపాయి.

ఈ ప్రభావన ఈ రోజు ఉదయం 150 పాయింట్లు బలపడి 16,200 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అలాగే 2010లో భారత్ 6.5 శాతం మేరకు వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి పర్యవేక్షణ సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయం వెలిబుచ్చింది. దీనికి తోడు దేశంలో మరికొన్ని సానుకూల పవనాలు స్టాక్ మార్కెట్‌ను నేడు లాభాల్లో నడిపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.