సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ (Markets | flat | early trade | BSE | Nifty | Mumbai | Pharama Shares | RCom)
Feedback Print Bookmark and Share
 
మూడు రోజులు సెలవుదినాల అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాలతోనే ఆరంభమైంది. మంగళవారం ఉదయం జరిగిన ప్రారంభ ట్రేడింగ్‌లోనే 56 పాయింట్లను కోల్పోయి 15,840 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ సైతం .5 శాతం మేరకు నష్టపోయి 4,685 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగుతోంది.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఫార్మా, ఆటో స్టాక్ షేర్లలో పెరుగుదల కనిపించగా, రియాలిటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఆర్‌కామ్ భారీగా నష్టాలను చవిచూసింది.

ఫలితంగా బీఎస్‌ఈ ఇండెక్స్ 2.1 శాతం మేరకు నష్టపోయింది. ఆర్‌కామ్ కంపెనీ శనివారం రెండో త్రైమాసికంలో నష్టాలతో కూడిన ఫలితాలను వెల్లడించింది. దీని ప్రభావం మంగళవారం ట్రేడింగ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.