స్టాక్ మార్కెట్: నష్టాల్లోనే కొనసాగుతున్న సెన్సెక్స్
మంగళవారం, 3 నవంబర్ 2009( 11:32 IST )
ముంబై స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఉదయం 11 గంటల సమయంలో క్రమంగా పుంజుకుని బలపడింది. అంతలోనే మళ్లీ నష్టాల దారిపట్టింది. ఫలితంగా 26 పాయింట్లను కోల్పోయిం 15869 వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ సాగుతోంది.
అలాగే, నిఫ్టీ సైతం 13 పాయింట్లను కోల్పోయి 4698 వద్ద సాగుతోంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూర్య ఫార్మ్, ప్రికాల్, బజాజ్ హిందుస్తాన్, సవితా కెమికల్స్ కంపెనీలు లాభాల దిశగా దూసుకెళుతున్నాయి. సుజ్లాన్, ఇండియా బుల్స్, గోదావరి పవర్, ప్రైమ్ సెక్టార్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.