ముంబై స్టాక్ మార్కెట్ భారీగా నష్టాన్ని చవిసూచింది. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం తిరిగి ప్రారంభమైన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఆరంభంలో 20 పాయింట్లు మాత్రమే కోల్పోయింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో 27 పాయింట్ల వృద్ధిని చవి చూసింది.
అయితే, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతానికి ఒక్కసారి స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోయింది. ఏకంగా 400 పాయింట్ల మేరకు నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్‌లు భారీ నష్టాలను చవి చూడటంతో ఆ ప్రభావం ముంబై స్టాక్ మార్కెట్‌పైనా పడింది. ఫలితంగా 400 పాయింట్లను కోల్పోయింది.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 451 పాయంట్లను కోల్పోయిన సెన్సెక్స్ సూచీ 15445 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 136 పాయింట్లను కోల్పోయి 4575 వద్ద కొనసాగుతోంది. లోహ వస్తు ట్రేడింగ్ ఐదు శాతం ఆయిల్ అండ్ గ్యాస్ ట్రేడింగ్ మూడు శాతం మేరకు పతనావస్థను చవిచూడటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. డీఎల్‌ఎఫ్, హిండాల్కోలు తొమ్మిది శాతం, జేపీ అసోసియేట్స్, స్టెరిలైట్ ఇండి, ఏసీసీలు ఆరు శాతం మేరకు నష్టపోగా, రిల్ ఐదు శాతం మేరకు నష్టపోయింది.