ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » భారీ పతనం దిశగా స్టాక్ మార్కెట్
(Stock Market | Sensex | Nifty | Mumabi | Losers | Gainers | Mutuval Funds)
ముంబై స్టాక్ మార్కెట్‌లో మరో భారీ పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ చూసి మంగళవారం దాదాపు 491 పాయింట్ల మేరకు పతనమైంది. అలాగే నిఫ్టీ సైతం 150 పాయింట్ల మేరకు కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడటంతో ఈ పరిణామం చోటు చేసుకుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఆరంభం నుంచి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యింది. ప్రధానంగా యూరోపియన్ యూనియన్ మార్కెట్ పతనం కావడంతో దీని ప్రభావం దలాల్ స్ట్రీట్‌పై పడింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి 491 పాయింట్ల మేరకు పతనమైంది.
కాగా మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో ప్రికాల్, సవిత్ కెమికల్స్, వినయల్ కెమికల్స్, సూర్య ఫార్మ, జెట్ ఎయిర్‌వేస్, నుచెమ్ కంపెనీలు లాభడపడ్డాయి. ఇడియా బుల్స్, ఐపీ సర్క్యూట్, ఐపీ రియల్ ఎస్టేట్, ఎక్సెల్ ఇన్ఫో, రోల్టా ఇండియా తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి.