ఇన్ని రోజులు నష్టాలతో వెలవెల బోయిన స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు కళకళలాడుతున్నాయి. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీ మార్కెట్‌పై సరిగ్గా ప్రభావితం చేసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 328 పాయింట్లు పుంజుకుని 15,733 వద్దకు చేరుకుంది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 4,655 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.13 శాతం, నిఫ్టీ 2 శాతం మేరకు వృద్ధి చెందాయి. రిలయన్స్ అత్యధిక టర్నోవర్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, డీఎల్ఎఫ్, సుజ్లోన్, హెచ్‌డీఐఎల్‌లు ఉన్నాయి.