స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 428 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,833 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 113 పాయింట్లు పుంజుకుని 4,677 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.78 శాతం, నిఫ్టీ 2.47 శాతం మేరకు వృద్ధి చెందాయి.
బీఎస్ఈ మధ్యతరహా కంపెనీల ఇండెక్స్ 2.30 శాతం, బీఎస్ఈ చిన్నతరహా కంపెనీల ఇండెక్స్ 1.22 శాతం మేరకు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం దాదాపు లాభాల్లోనే నమోదు చేస్తున్నాయి.