దిశ మార్చుకున్న మార్కెట్లు: లాభాలతో ముగిసిన సెన్సెక్స్
స్టాకా మార్కెట్లు ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి. భారీ కరెక్షన్ వంటి వార్తలు వెలువడున్న నేపథ్యంలో.. అన్ని కథనాలకు బ్రేక్ వేస్తూ.. స్టాక్ మార్కెట్ ఈ రోజు బుల్స్ పరుగులతో కళకళలాడింది. బేర్స్‌పై విజయం సాధించిన బుల్.. సెంటిమెంట్ బలంతో.. స్టాక్ మార్కెట్‌కు భారీ లాభాలను చేకూర్చిచింది.
దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 507 పాయింట్లు బలపడి 15,912 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 147 పాయింట్లు పుంజుకుని 4,711 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 3.29 శాతం, నిఫ్టీ 3.22 శాతం మేరకు బలపడ్డాయి. దాదాపు సెన్సెక్స్ 16వేల మార్కుకు, నిఫ్టీ 5వేల మార్కుకు సమీపాన ముగియడం మార్కెట్ పురోగతి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.
రియాల్టీ, ఐటీ, మెటల్ స్టాకులు స్టాక్ మార్కెట్ పురోగతిలో కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రక్రియలో గత ముగింపల్లో నష్టాలను ఇండెక్స్ చాలా వరకు రికవరీ చేసింది. విదేశీ పెట్టుబడులపై తాము ఎలాంటి అంక్షలు విధించలేదని.. వాస్తవానికి పెట్టుబడులు చాలా వరకు పెరిగాయని.. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.
వరుస నష్టాలతో స్టాకా మార్కెట్ కూరుకుపోతున్న నేపథ్యంలో.. ప్రణబ్ హామీ.. బలాన్నిచ్చాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు సైతం స్టాక్ మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. ఇదే తరుణంలో యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు కూడా బలాన్నిచ్చాయి. దీంతో అత్యంత విలువైన షేర్ రిలయన్స్ అత్యధిక టర్నోవర్ సాధించింది.
కాగా, సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,778 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,770 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 905 కంపెనీల వాటాలు నష్టాలతో ముగిశాయి.
లాభపడ్డ కంపెనీలు జేపీ అసోసియేట్స్, హిండాల్కో, డీఎల్ఎఫ్, స్టెరిలైట్, రిలయన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, గ్రాసిం, టాటా పవర్ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.