అంతర్జాతీయ ప్రతికూలతలతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మధ్యాహ్నపు ట్రేడ్ సమయానికల్లా తిరిగి రికవరీ అయి 16వేల మార్కును సైతం దాటింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 160 పాయింట్లు బలపడి 16,072 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 4,768 వద్ద పయనిస్తోంది.
సెన్సెక్స్ 1.01 శాతం, నిఫ్టీ 1.22 శాతం మేరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మధ్య తరహా కంపెనీల ఇండెక్స్ 2.13 శాతం, బీఎస్ఈ చిన్న తరహా కంపెనీల ఇండెక్స్ 1.93 శాతం మేరకు వృద్ధి చెందాయి.