సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసిన సెన్సెక్స్ (Stock Market | gains | Sensex | BSE | NSE | trade | shares | Index | losses)
Feedback Print Bookmark and Share
 
ఎట్టకేలకు నష్టాల నుంచి తేరుకుని తిరిగి రెండో రోజు మళ్లీ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు పుంజుకుని 16,064 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 4,766 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.95 శాతం, నిఫ్టీ 1.16 శాతం మేరకు వృద్ధి చెందాయి.

నిన్నటి లాభాలు ఒకరోజు ముచ్చటేనా అని తలపించే రీతిలో ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. కేవలం గంట వ్యవధిలో ఏకంగా 300 పైచిలుకు పాయింట్లను నష్టపోయింది. అంతర్జాతీయ ప్రతికూలతలు దీనికి తోడవడంతో ఈ నష్టాల కారణమయ్యాయి. గత మూడేళ్ల కాలంలో.. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వం రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం క్లీన్ చిట్ ఇచ్చింది.

దీనికి స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి పి చిదంబరం సహా.. పలువురు ప్రముఖులు.. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్‌లో 10 శాతానికి పైగా షేర్లను కలిగి ఉన్నట్లు తెలిపారు. దీనికి తోడు కొత్త పన్ను నిబంధనల ద్వారా తక్కువ పన్నులపై ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సంకేతాలిచ్చారు.

దీంతో స్టాక్ మార్కెట్ మధ్యాహ్నపు ట్రేడ్‌ వరకు నష్టాల్లోనే పయనించింది. అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌లో టెలికాం, మెటల్, రియాల్టీ, విద్యుత్, ఆటో, చమురు మరియు గ్యాస్, ఎంపిక చేసుకున్న బ్యాంకింగ్, కేపిటల్ గూడ్స్ స్టాకుల్లో భారీగా కొనుగోళ్లు.. మార్కెట్ల రికవరీకి సాయపడ్డాయి.

అయితే. ఎస్‌బీఐ, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, అంబుజా సిమెంట్స్, ఏసీసీ తదితర కంపెనీ స్టాకుల్లో విక్రయాలుండటంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,745 వాటాలు ట్రేడ్ అవగా, 1,829 వాటాలు లాభపడ్డాయి. అలాగే 839 వాటాలు నష్టపోయాయి.

మెటల్, రియాల్టీ, విద్యుత్ రంగాలు మార్కెట్‌కు ఎనలేని శక్తినిచ్చాయి. ఈ రంగాలు అన్నీ రెండు నుంచి మూడు శాతం వరకు లాభపడ్డాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్, హిండాల్కో, భారతీ, ఎంఅండ్ఎం, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి. అయితే ఎస్‌బీఐ, ఐటీసీ, ఏసీసీలు మాత్రం నష్టాలను చవిచూశాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.