సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » లాభాలతో సెన్సెక్స్ ప్రారంభం: కానీ నష్టాలకు అవకాశం (Stock Market | profits | Sensex | BSE | NSE | trade | shares)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 163 పాయింట్లు పుంజుకుని 16,227 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిప్టీ 57 పాయింట్లు లాభపడి 4,822 వద్ద పయనిస్తోంది.

సెన్సెక్స్ 1.01 శాతం, నిఫ్టీ 1.19 శాతం మేరకు బలపడ్డాయి. నిన్నటి లాభాలను ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్ కొనసాగిస్తోంది. అయితే... లాభార్జన కోసం విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నందున నష్టాలకు అవకాశం ఉంది. నిన్న అమెరికా మార్కెట్లు సైతం బలమైన లాభాలతో ముగిశాయి.

అక్టోబర్ 22 తర్వాత తొలిసారిగా డౌ జోన్స్ 10వేల మార్కును అందుకుంది. ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ప్రారంభమయ్యాయి. కాగా, భారత స్టాక్ మార్కెట్లో కన్‌స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, పీఎస్‌యూ, మెటల్ తదితర ఇండెక్స్‌లు లాభాల్లో ఉన్నాయి.

ఇప్పటి వరకు మొత్తం 831 స్టాకులు ట్రేడ్ అవగా, 755 స్టాకులు లాభాల్లో ఉన్నాయి. అలాగే 65 స్టాకులు నష్టాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్ అత్యధిక లాభాల్లో ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.