స్టాక్ మార్కెట్ లాభాలతో పుంజుకుంటోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 217 పాయింట్లు బలపడి 16,281 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 4,834 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.35 శాతం, నిఫ్టీ 1.44 శాతం మేరకు వృద్ధి చెందాయి.
టాటా స్టీల్ అత్యధిక లాభాల్లో ఉంది. జేపీ అసోసియేట్స్, హిండాల్కో, స్టెరిలైట్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. హిందుస్థాన్ యునిలీవర్, ఐటీసీ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి. కన్‌స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, పీఎస్‌యూ, మెటల్ తదితర సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో పరిగెడుతున్నాయి.