అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఆర్థిక రికవరీ సెంటిమెంట్ మార్కెట్లను లాభాల్లో నడిపింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 2 శాతంతో 204 పాయింట్లు లాభపడి 10,006 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 2.42 శాతంతో 50 పాయింట్లు పుంజుకుని 2,105 వద్దకు చేరుకుంది.
ఆసియా మార్కెట్లు హాంగ్ సెంగ్- 2 శాతంతో 362 పాయింట్లు లాభపడి 21,841 వద్దకు చేరుకుంది. నిక్కీ- 1 శాతంతో 64 పాయింట్లు పుంజుకుని 9,781 వద్దకు చేరుకుంది. షాంఘై కంపోజిట్- 0.5 శాతంతో 18 పాయింట్లు పెరిగి 3,172 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్- 1 శాతం మేరకు పుంజుకుని 1,569 వద్దకు చేరుకుంది.