స్టాక్ మార్కెట్ 106 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,170 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 4,795 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.66 శాతం, నిఫ్టీ 0.63 శాతం మేరకు వృద్ధి చెందాయి.
బీఎస్ఈ మధ్య తరహా కంపెనీల ఇండెక్స్ 2.36 శాతం, బీఎస్ఈ చిన్న తరహా కంపెనీల ఇండెక్స్ 2.23 శాతం మేరకు బలపడ్డాయి. ఇప్పటి వరకు మొత్తం 2,717 వాటాలు ట్రేడ్ అవగా, 1,921 వాటాలు లాభపడ్డాయి. అలాగే 725 వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.