స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసి హ్యాట్రిక్ కొట్టింది. అలాగే స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 16,158 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 31 పాయింట్లు పుంజుకుని 4,796 వద్ద ముగిసింది.
మూడో రోజు వరుసగా స్టాక్ మార్కెట్ లాభాలతో 16,137 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో 220 పాయింట్లు పుంజుకుని 16,284 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. మెటల్, రియాల్టీ స్టాకుల్లో కొనుగోల్లు ఇండెక్స్ పురోగతికి దోహదం చేశాయి. అయితే అదే సమయంలో.. అత్యంత విలువైన షేర్ రిలయన్స్, ఇన్ఫోసిస్‌లలో విక్రయాలు స్టాక్ మార్కెట్లో లాభాల జోరు తగ్గింది.
దీంతో స్టాక్ మార్కెట్ 209 పాయింట్లు కోల్పోయి 16,075 వద్దకు పడిపోయింది. అయితే అంతర్జాతీయ సానుకూలతలతో తిరిగి స్టాక్ మార్కెట్ రికవరీ కాగలిగింది. 94 పాయింట్ల లాభంతో ముగిసింది. దీంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసింది.
అయితే ఈ మంగళవారం 500 పాయింట్లు స్టాక్ మార్కెట్ కోల్పోయింది. ఇందులో.. 262 పాయింట్లు తిరిగి రికవరీ చేసుకోగలిగింది. బీఎస్ఈ మధ్యతరహా కంపెనీల ఇండెక్స్, చిన్నతరహా కంపెనీల ఇండెక్స్ 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. పీఎస్‌యూ ఇండెక్స్ 4 శాతం, రియాల్టీ, మెటల్, బ్యాంకెక్స్‌లు కూడా 2 శాతం చొప్పున బలపడ్డాయి.
సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,787 వాటాలు ట్రేడ్ అవగా, 1,941 వాటాలు లాభపడ్డాయి. అలాగే 783 వాటాలు నష్టాలతో ముగిశాయి.
లాభపడ్డ కంపెనీలు
జేపీ అసోసియేట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, డీఎల్ఎఫ్, స్టెరిలైట్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, రిలయన్స్ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.
నష్టాలను చవిచూసిన కంపెనీలు
టాటా పవర్, ఎఫ్ఎంసీజీ స్టాకులు హిందుస్థాన్ యునిలివర్ అత్యధిక నష్టాలను చవిచూసింది. ఐటీసీ, ఆటో స్టాకులు.. హీరో హోండా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.