సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » ఉద్యోగ నివేదిక నిరుత్సాహపరిచినా.. లాభపడ్డ స్టాకులు (Stock Market | America | Dow Jones | Nasdaq | Indian ADR)
Feedback Print Bookmark and Share
 
ఉద్యోగం నివేదిక నరుత్సాహపరిచింది. అయినా, అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికాలో నిరుద్యోగ రేటు కనీసం 26 1/2 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంటే దాదాపు 10.2 శాతానికి పెరిగిందన్నమాట. అయితే దీని ప్రభావం స్టాకులపై పడలేదు.

డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 17 పాయింట్లు పుంజుకుని 10,023 వద్దకు చేరుకుంది.
నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- ఏడు పాయింట్లు లాభపడి 2,112 వద్దకు చేరుకుంది.

కానీ, భారత ఏడీఆర్‌లు స్థిరంగా ముగిశాయి. ఎంటీఎన్ఎల్, ఇన్ఫోసిస్, మహీంద్రా సత్యంలు స్వల్పంగా నష్టపోయాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, టాటా కమ్యూనికేషన్స్ తదితర సంస్థలు స్వల్పంగా లాభపడ్డాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.