ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్వల్ప లాభాలతో ప్రారంభమైన బాంబే స్టాక్ మార్కెట్ (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares)
అమెరికా మార్కెట్ లాభాలతో ర్యాలీని ముగించడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను నమోదు చేసుకుంది. కానీ అర్థగంటలోపు స్టాక్ మార్కెట్ తిరిగి పుంజుకుని స్వల్ప లాభాలను గడించింది.
దీంతో సెన్సెక్స్ 9 పాయింట్ల వృద్ధితో 17,059 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 11 పాయింట్లు పుంజుకుని 5,074 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
మెటల్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ మరియు క్యాపిటల్ గూడ్స్ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. స్టెర్లైట్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హిందాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, డీఎల్‌ఎఫ్ వంటి కంపెనీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అయితే బీపీఎల్, మార్లా ఓవర్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి.