సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » ట్రేడింగ్ బలహీనత: నష్టాల్లో సెన్సెక్స్ పయనం (Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Selling pressure| Investors)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 44 పాయింట్లు పతనమై 16,741 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 0.35 పాయింట్లతో, 4,988 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.

రియాల్టీ, కంజ్యూమర్ డూరబుల్స్, బ్యాంకింగ్, మెటల్ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురికావడం కూడా బాంబే స్టాక్ మార్కెట్ పతనానికి కారణమని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గత రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తోన్న సెన్సెక్స్, వారాంతమైన శుక్రవారం కూడా తిరోగమనం వైపే తన ర్యాలీని కొనసాగిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.