విదేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమనంవైపు పయనిస్తున్న కారణంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ నష్టాల్లో కూరుకుపోయింది. వారాంతమైన శుక్రవారం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 42 పాయింట్లు పడిపోయి, 16,743 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14పాయింట్ల నష్టంతో 4,974 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఇకపోతే కంజ్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, మెటల్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పతనావస్థలో ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకుంటే సెన్సెక్స్ వారాంతం లాభాలతో ముగిసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.