సోమవారంతో ప్రారంభమైన ఈ వారంలోని చివరి మూడు రోజుల్లో సెన్సెక్స్ తిరోగమనం పయనిస్తోంది. బుధ, గురువారాల్లో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ వారాంతమైన శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 108 పాయింట్లు భారీగా క్షీణించి, 16,677 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 52 పాయింట్లు పతనమై, 4,936 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత, దేశీయ కంజ్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, మెటల్ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురికావడం వంటి కారణాలే బాంబే స్టాక్ మార్కెట్ కొంప ముంచాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. నాగార్జున కన్స్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ), జిందాల్ డిర్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు లాభాలను నమోదు చేసుకున్నాయి.