పుంజుకున్న యూరప్ మార్కెట్ ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్
యూరప్ మార్కెట్ సూచీలైన ఎఫ్‌టీఎస్ఈ100, డాక్స్‌లు లాభాల వైపు పయనించడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పుంజుకుని ఏకంగా 186 పాయింట్లు లాభపడింది.
దీంతో సెన్సెక్స్ సూచీ 16,972 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు వృద్ధి చెంది, 5, 028 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనతతో నష్టాలను నమోదు చేసుకున్నసెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇంకా బలపడే అవకాశముందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.