విదేశీ మార్కెట్ల లాభదాయక సంకేతాల ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముందడుగు వేస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్మం మూడు గంటల ప్రాంతంలో 176 పాయింట్లు పుంజుకుని 16,962 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 55 పాయింట్లు బలపడి 5,044 మార్కు వద్ద పయనిస్తోంది.
యూరప్ మార్కెట్లు లాభపడటం, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్, మెటల్, ఎఫ్ఎంసీజీ వాటాలు మెల్ల మెల్లగా అమ్మకపు ఒత్తిడి నుంచి బయటపడటంతో బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చిందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.