ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » మిశ్రమ ఫలితాల్లో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు (Finance| Sensex| Nifty| Nasdaq| Stock markets| Nikkei| Eurpoe| America| Asia)
శుక్రవారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు లాభ, నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
అయితే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మాత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 236 పాయింట్ల భారీ లాభంతో 17,021 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 63 పాయింట్లు పుంజుకుని 5,052 మార్కు వద్ద ర్యాలీని ముగించింది. యూరప్ మార్కెట్లు పుంజుకోవడంతోనే ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను చవిచూసిన బీఎస్ఈ ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను నమోదు చేసుకుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో, 5,282 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ 18 పాయింట్లు పుంజుకుని 5,720 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
అయితే ఆసియా మార్కెట్లు మాత్రం శుక్రవారం నష్టాలను చవిచూశాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 51 పాయింట్ల నష్టంతో 9,497 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. హాంగ్ షెంగ్ 187 పాయింట్లు భారీగా పతనమై, 22,455 పాయింట్ల వద్ద పయనిస్తోంది.