సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » కొనుగోళ్లపై మదుపుదారుల దృష్టి: సెన్సెక్స్ వృద్ధి (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Feedback Print Bookmark and Share
 
మదుపుదారులు కొనుగోళ్లపై మొగ్గు చూపడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. విదేశీ కొనుగోళ్లలో సంచలనం సృష్టించిన రిలయన్స్.. ప్రపంచ పాలిమర్స్, పెట్రో కెమికిల్స్, ఇంధన రంగంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన.. డచ్ దిగ్గజం 'లియోండల్‌ బాసెల్'ను చేజిక్కించుకునేందుకు ఆర్ఐఎల్ ఉరకలేస్తోంది. సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా నిలిచేందుకు ఆఫర్ బిడ్‌ను కూడా రిలయన్స్ సమర్పించడం స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది.

దీంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన ఒక గంటలోపే బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 61 పాయింట్లు పుంజుకుని, 17,083 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్లు బలపడి 5,069 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.