సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » లాభాల్లో స్టాక్ మార్కెట్: 136 పాయింట్ల సెన్సెక్స్ వృద్ధి (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Feedback Print Bookmark and Share
 
ఎగుమతి రంగంలో పన్ను తిరిగి చెల్లించే పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలను నమోదు చేసుకుంటుంది.

దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 136 పాయింట్లు పుంజుకుని 17,158 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు బలపడి, 5,096 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

ఇకపోతే.. ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎమ్‌సీజీ ఇండెక్స్‌లు 14.3 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, మదుపుదారులు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో ఐటీ సూచీ మాత్రం 1.08 శాతం పడిపోయింది. ముఖ్యంగా అరబిందో పార్మా కంపెనీ ట్రేడింగ్ 6.06 శాతం పుంజుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.