అతిపెట్ట విదేశీ సంస్థ లియోండల్ కొనుగోలు రిలయన్స్ సై అనడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా నిలిచేందుకు ఇప్పటికే ఆఫర్ బిడ్‌ను కూడా సమర్పించింది. ఈ ఆఫర్ విలువ 12 బిలియన్ డాలర్ల వరకు (రూ. 57వేల కోట్లకు పైగా) ఉండొచ్చునని పరిశ్రమ వర్గాల అంచనా.
ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 155 పాయింట్లు వృద్ధి చెంది, 17,177 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి, 5,100 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ సూచీ 6,000 మార్కును తాకే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆయిల్, గ్యాస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎమ్‌సీజీ, రియాల్టీ, పార్మా, బ్యాంకింగ్ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తుందని వారు చెప్పారు.