ఊపందుకున్న విదేశీ మార్కెట్ల ట్రేడింగ్: పురోగమనంలో సెన్సెక్స్
యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా ప్రారంభం కావడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 111 పాయింట్లు పుంజుకుని, 17,133 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు బలపడి, 5,093 మార్కు వద్ద కొనసాగుతోంది.
ఆయిల్ గ్యాల్, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, పార్మా వాటాల కొనుగోళ్ల పుంజుకోవడం కూడా బాంబే స్టాక్ మార్కెట్ లాభదాయకంగా కొనసాగడానికి ప్రధాన కారణమని బాంబే స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎల్, భెల్, జై ప్రకాష్ అసోసియేట్స్, సుజ్లాన్ వంటి కంపెనీల వాటాలు అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీటీ, టాటా స్టీల్, సన్ పార్మా, ఓఎన్‌జీసీ వంటి కంపెనీలు లాభాలను నమోదు చేసుకున్నాయి.