దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడం, ఆసియా మార్కెట్ల ఆశాజనక సంకేతాలు బాంబే స్టాక్ మార్కెట్‌ను లాభాల్లో పయనింపజేస్తున్నాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ 171 పాయింట్లు వృద్ధి చెంది, 17,193 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 49 పాయింట్లు బలపడి, 5,102 పాయింట్లు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
ఎగుమతి రంగానికి చెందిన తిరిగి పన్నుల చెల్లింపు పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేయడం కూడా బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకోవడానికి కారణమైందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. హెల్త్ కేర్, మెటల్, ఆటో మరియు బ్యాంకు రంగానికి చెందిన వాటాల కొనుగోళ్లు పుంజుకోగా, ఐటీ మరియు టెక్ సెక్టార్లకు చెందిన షేర్లు అమ్మకపు ఒత్తిడి గురవుతున్నాయి.