సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » లాభాలతో కొనసాగుతున్న విదేశీ మార్కెట్లు (Finance| Sensex| Nifty| Nasdaq| Stock markets| Nikkei| Eurpoe| America| Asia)
Feedback Print Bookmark and Share
 
సోమవారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.00 గంటలకు యూరప్, ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

అలాగే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మాత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 148 పాయింట్ల భారీ లాభంతో 17,170పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు పుంజుకుని 5,096 మార్కు వద్ద ర్యాలీని ముగించింది.

ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 67 పాయింట్ల లాభంతో, 5,335 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ 82 పాయింట్లు పుంజుకుని 5,746 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

అలాగే ఆసియా మార్కెట్లు కూడా సోమవారం లాభాల బాటలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 51 పాయింట్ల లాభంతో 9,497 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. హాంగ్ షెంగ్ 315 పాయింట్లు భారీగా పుంజుకుని, 22,771 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.