దేశీయ బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగిసింది. మదుపుదారులు కొనుగోళ్ల వైపు దృష్టి సారించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 158 పాయింట్లు పుంజుకుని, 17,180 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 51 పాయింట్లు బలపడి, 5,103 పాయింట్ల వద్ద నిలిచింది.
ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోవడం, విదేశీ సంస్థ లియోండెల్‌బాసెల్ ఇండస్ట్రీ కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మొగ్గుచూపడం వంటి కారణాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల బాటన పయనింపజేశాయి.
అలాగే ఎగుమతి రంగంలో తిరిగి పన్ను చెల్లింపు విధానాన్ని అమలు చేయడంపై కేంద్రప్రభుత్వం కసరత్తు చేయడం., త్వరలో ఈ విషయానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ఆర్థిక శాఖ సన్నాహాలు చేయడం వంటి కారణాలు బాంబే స్టాక్ మార్కెట్‌ను ఆశాజనకంగా నడిపాయి.
ఇదేవిధంగా.. ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, పార్మా, బ్యాంక్ మరియ పీఎస్‌యూ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడం కూడా బీఎస్ఈ సూచీ లాభాలను నమోదు చేసుకోవడానికి ప్రధాన కారణమైందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో ఐదు వారాల తర్వాత బాంబే స్టాక్ మార్కెట్ 158 పాయింట్లతో 17,180 మార్కును తాకిందని వారు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎమ్‌సీజీ వాటాల అమ్మకాలు పుంజుకోగా, భారతీ ఎయిర్‌టెల్, జైప్రకాష్ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి.