గత ఏడాది చివరి రోజున ముంబయి స్టాక్ ఎక్సేంజ్ గణనీయమైన లాభాలను ఆర్జించింది. ముఖ్యంగా గత నెల డిసెంబరు నెల మొత్తాన్ని సమీక్షించి చూచినపుడు సెన్సెక్స్ అనూహ్యంగా 81 శాతం మేర లాభాలను గడించినట్లు గణాంకాలు చెపుతున్నాయి.
కొత్త సంవత్సరం 2010లో సోమవారంనాడు ప్రారంభం కానున్న ట్రేడ్‌లోనూ ఇదే హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్ 18 వేల పాయింట్ల వద్ద ప్రారంభమైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మొత్తమ్మీద ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి మార్కెట్ బయటపడినట్లు వ్యాపార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.