మంగళవారం విదేశీ స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ఒక్క అమెరికా స్టాక్ మార్కెట్ మాత్రమే నష్టాల్లో కూరుకుపోగా, ఆసియా, యూరప్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగాయి. దీంతో భారత కాలమానం సాయంత్రం 4.30 గంటలకు దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాల్లో ర్యాలీని పయనింపజేస్తున్నాయి.
ఇందులో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 106 పాయింట్లు పుంజుకుని, 16,042 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 32 పాయింట్లు వృద్ధి చెంది, 4,792 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఇదేవిధంగా యూరప్ మార్కెట్ సూచీలైన ఎఫ్‌టీఎస్ఈ 100 19 పాయింట్లు లాభపడి, 5,111 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే డాక్స్ సూచీ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే వృద్ధి చెంది, 5,490 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అయితే ఆసియా మార్కెట్ సూచీలైన నికాయ్, హాంగ్‌షెంగ్‌లు మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి.
ఇందులో నికాయ్ సూచీ 18 పాయింట్లు బలపడి, 9,932 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 239 పాయింట్ల లాభంతో 19,790 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఇకపోతే.. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ డౌ కూడా గత సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 103 పాయింట్ల లాభంతో, 9,908 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.