ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్వల్ప లాభాలతో ప్రారంభమైన బాంబే స్టాక్ మార్కెట్ (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 47 పాయింట్లు పుంజుకుని, 16,089 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 12 పాయింట్ల వృద్ధితో 4,805 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
మెటల్, కంజ్యూమర్ డూరబుల్స్ వంటి వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
హిందాల్కో, జైప్రకాష్ అసోసియేట్స్, టాటా స్టీల్, స్టెర్లిట్, టాటా మోటార్స్, విప్రో వంటి సంస్థలు లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్, సన్ పార్మా, ఐటీసీ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.