సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్: నష్టాల్లో సెన్సెక్స్ (Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Bookmark and Share Feedback Print
 
బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో 22 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో సెన్సెక్స్ సూచీ, 16,019 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం 8 పాయింట్ల నష్టంతో 4,784 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.

పార్మా, పవర్, క్యాపిటల్ గూడ్స్ వాటాల ట్రేడింగ్ క్షీణదశలో కొనసాగడమే సెన్సెక్స్ పతనానికి ప్రధాన కారణమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కానీ కంజ్యూమర్ డూరబుల్స్, రియాల్టీ, మెటల్, ఆటో వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరిగి లాభాలను ఆర్జించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.