బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభ, నష్టాలతో ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏడు పాయింట్ల స్వల్ప లాభంతో, 16,050 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఒక పాయింట్ వృద్ధితో 4,793 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
అమెరికా, యూరప్ మార్కెట్లు లాభాలను ఆర్జించడం, దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టి సారించడంతో సెన్సెక్స్ వృద్ధి చెందిందని వారు చెబుతున్నారు.