బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే వృద్ధిబాటలో కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 46 పాయింట్లు పుంజుకుంది. దీంతో ఏడు వారాల గరిష్ట స్థాయికి సెన్సెక్స్ చేరుకుంది.
ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్లు బలపడి, 5,116 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అమెరికా స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. దీంతో పాటు మదుపుదారులు సైతం కొనుగోళ్లపై మొగ్గుచూపడంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందింది.
ఇదే విధంగా ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎమ్‌సీజీ, రియాల్టీ, ఆటో, కన్జూమర్ డూరబుల్స్ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది.
కానీ ఐటీ, టెక్, హెల్త్‌కేర్, మెటల్, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పవర్ వాటాల ట్రేడింగ్ నత్తనడకన కొనసాగడంతో పాటు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను ఆర్జించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికాని పక్షంలో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ వృద్ధిని నమోదు చేసుకునేవని వారు చెబుతున్నారు.
ఇకపోతే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్ వంటి కంపెనీలు లాభాలను నమోదు చేసుకోగా, లార్సెన్ టర్బో, ఎన్టీపీసీ, ఓన్‌జీసీ, ఎస్‌బీఐ, స్టెర్లిట్ ఇండస్ట్రీస్, సన్ పార్మా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, విప్రో వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.