అంతర్జాతీయ మార్కెట్‌ల ట్రేడింగ్‌లలో చోటు చేసుకున్న ఒడిదుడుకుల ప్రభావం కారణంగా స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో ముగిసింది. ఇంట్రాట్రేడ్‌లో బాగా పుంజుకున్న సెన్సెక్స్ సూచీ ట్రేడింగ్ ముగిసే సమయానికి 61 పాయింట్లు లాభపడి 17,167 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 17 పాయింట్లు లాభపడి 5133 వద్ద ముగిసింది. కాగా, ఇంట్రాట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ గరిష్టంగా 161 పాయింట్లు లాభపడటంతో 17215 పాయింట్లను తాకింది.
గురువారం నాటి ట్రేడింగ్‌లో సన్ ఫార్మా, స్టెరిలైట్, భారతీ ఎయిర్‌టెల్, విప్రోలు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, గ్రాసీం, ఎన్టీపీసా, ఇన్ఫోసిస్ కంపెనీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. అలాగే, ఎక్కువగా నష్టపోయిన కంపెనీలలో హిందుస్తాన్ యూనీ లీవర్ ఉంది. ఈ కంపెనీ నాలుగు శాతం మేరకు నష్టాలను చవి చూసింది. హిండాల్కో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఏసీసీలు ఒక్కో శాతం చొప్పున నష్టాన్ని చవి చూశాయి.