సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాల్లో కూరుకుపోయిన విదేశీ స్టాక్ మార్కెట్లు (Finance | Sensex | Nifty | Nasdaq | Stock markets | Nikkei | Europe | America | Asia)
Bookmark and Share Feedback Print
 
వారాంతమైన శుక్రవారం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తున్నాయి.

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని ఆరంభించిన సెన్సెక్స్, వారాంతమైన శుక్రవారం 124 పాయింట్లు క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 17,868 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పతనమై 5,367 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.

అలాగే అమెరికా స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం పతనమైంది. ఇందులో డౌ సూచీ 30 పాయింట్లు క్షీణించి, 10,467 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇంకా యూరప్ మార్కెట్ కూడా నష్టాల బాటలో కొనసాగుతోంది. ఇందులో ఎఫ్‌టీఎస్ఈ 25 పాయింట్లు పతనమై, 5,288 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే డాక్స్ సూచీ 29 పాయింట్లు పతనమై, 6,105 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

ఇకపోతే.. ఆసియా స్టాక్ మార్కెట్ సైతం శుక్రవారం కుప్పకూలింది. ఇందులో నికాయ్ సూచీ 158 పాయింట్లు పతనమై, 9,537 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే హాంగ్‌షెంగ్ కూడా 64 పాయింట్లు క్షీణించి, 21,029 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.