స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ముగిసింది. వారాంతపు ట్రేడింగ్‌పై విదేశీ మార్కెట్ల ప్రభావం బాగా కనిపించింది. ఫలితంగా ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ 93 పాయింట్ల వృద్ధితో 18167 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 35 పాయింట్ల వృద్ధితో 5452 వద్ద ముగిసింది.
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ప్రధానంగా ఏబీబీ, హిండాల్కో, మారుతి, గెయిల్, ఎస్.బి.ఐ.ఎన్ కంపెనీలు లాభపడగా, హెచ్.సీఎల్, సుజ్లాన్, జేపీఏ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు నష్టాల బాటలో పయనించాయి.