ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » మిశ్రమ ఫలితాల్లో విదేశీ స్టాక్ మార్కెట్లు! (Finance | Sensex | Nifty | Nasdaq | Stock markets | Nikkei | Europe | America | Asia)
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకోగా, ఆసియా, అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
ఇందులో బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం ట్రేడిగంగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలను ఆర్జించింది. ఇందులో సెన్సెక్స్ ఏడు పాయింట్ల స్వల్ప వృద్ధితో 18,409 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 12 పాయింట్లు పుంజుకుని 5,543 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది.
ఇదేవిధంగా యూరప్ మార్కెట్ సైతం సోమవారం లాభాలను నమోదు చేసుకుంది. ఎఫ్‌టీఎస్ఈ సూచీ 37 పాయింట్ల లాభంతో 5,232 పాయింట్ల మార్కును తాకగా, డాక్స్ సూచీ 29 పాయింట్లు లాభపడి, 6,034 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
అయితే అమెరికా, ఆసియా మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అమెరికా డౌ సూచీ మాత్రం 57 పాయింట్లు క్షీణించి, 10,213 పాయింట్ల మార్కును తాకింది. అలాగే ఆసియా నికాయ్ 62 పాయింట్లు పతనమై 9,116 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, హాంగ్‌షెంగ్ 92 పాయింట్లు క్షీణించి 20,889 పాయింట్ల వద్ద పయనిస్తోంది.