బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 69 పాయింట్లు పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ సూచీ 18,275 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 22 పాయింట్లు లాభపడి, 5,494 పాయింట్ల మార్కును తాకింది.
కన్జూమర్ డూరబుల్స్, మెటల్, ఆటో, రియాల్టీ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. ఇంకా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.