బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ముగిసింది. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకుని 18238 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప లాభంతో 5,486 పాయింట్ల మార్కును తాకింది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పురోగమనం వైపు కొనసాగడం ద్వారా స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. అమెరికా, ఆసియా, యూరప్ మార్కెట్లు పుంజుకోవడం స్టాక్ మార్కెట్ వృద్ధికి తోడ్పడింది. ఇంకా దేశీయ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగడంతో స్టాక్ మార్కెట్ లాభాల దిశగా ర్యాలీని ముగించింది.
ఇకపోతే.. జేపీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, హీరో హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు లాభపడగా, హీరో హోండా, టీసీఎస్, భెల్, ఆర్‌కామ్ వంటి సంస్థలు నష్టాల్లో కూరుకుపోయింది.