వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ఆరంభం నుంచి ఆశాజనకంగా కొనసాగుతున్న సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏడు పాయింట్ల స్వల్ప నష్టంతో 18,230 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా ఏడు పాయింట్లు పతనమై, 5,478 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇంకా దేశీయ వాటాల ట్రేడింగ్ మందకొడిగా సాగడం బాంబే స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైంది. అలాగే మదుపుదారులు కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపకపోవడం సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.