సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » ట్రేడింగ్ క్షీణత: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్! (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Bookmark and Share Feedback Print
 
దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను ఆర్జిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలను నమోదు చేసుకున్న సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కేవలం ఒక్క పాయింట్ లాభంతో 18,240 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా కేవలం ఒక్క పాయింట్ వృద్ధితో 5,488 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగుతోంది.

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను ఆర్జించింది. ఇంకా ద్రవ్యోల్బణం ప్రకటనపై మదుపుదారులు ఎదురుచూడటం, లాభాల స్వీకరణను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.