సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » మిశ్రమ ఫలితాల్లో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు (Finance | Sensex | Nifty | Nasdaq | Stock markets | Nikkei | Europe | America | Asia)
Bookmark and Share Feedback Print
 
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోగా, ఆసియా, అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి.

ఇందులో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 18,221 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 6 పాయింట్లు స్వల్పంగా పతనమై 5,479 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అయితే అమెరికా డౌ సూచీ 50 పాయింట్లు పుంజుకుని 10,320 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అలాగే యూరప్ మార్కెట్ సూచీ ఎఫ్టీఎస్‌ఈ 29 పాయింట్ల స్వల్ప లాభంతో 5,400 పాయింట్ల మార్కును తాకింది. డాక్స్ కూడా 24 పాయింట్ల లాభంతో 6,107 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

ఇకపోతే, ఆసియా మార్కెట్ సూచీల్లో నికాయ్ 51పాయింట్లు బలపడి 9,114 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, హాంగ్‌షెంగ్ 102 పాయింట్ల వృద్ధితో 20,971 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.