సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్! (Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Bookmark and Share Feedback Print
 
FILE
వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. రోజంతా ఒడిదుడుకుల మధ్య ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి కుప్పకూలింది. ఇందులో సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 16 పాయింట్లు పతనమై, 18221 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా ఆరు పాయింట్ల నష్టంతో 5,500 మార్కు (5479)కు దగ్గర్లో ర్యాలీని ముగించింది.

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మిశ్రమ ఫలితాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఇంకా ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకోవడం బాంబే స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది. భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) తన ద్రవ్య పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేయండంతో ద్రవ్యోల్బణం మళ్లీ తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయి.

వర్షాలు సరిగ్గా పడటంతో ఆహార ద్రవ్యోల్బణం దిగవస్తుందన్న ప్రభుత్వం అంచనాలను తారుమారు చేస్తూ ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కుతుంది. ఆగస్టు నెలలో వరుసగా రెండు వారాల పాటు తగ్గుముఖం పట్టిన ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టు మూడోవారంలో మాత్రం పైకి ఎగబాకింది. ఆగస్టు 29తో ముగిసిన వారాంతానికి గానూ ఆహార ద్రవ్యోల్బణం 10.86శాతంగా నమోదైంది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. దీనికి తోడు దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడం బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది.

ఇకపోతే.. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఓఎన్‌జీసీ, హిందూస్థాన్ యునిలివర్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు లాభపడగా, జిందాల్ స్టీల్, హిందాల్కో, స్టెర్లిట్, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.